బహ్రెయిన్:కాఫీ షాప్ లో పేలుళ్లు..పది మందికి గాయాలు
- January 26, 2020
బహ్రెయిన్:మాఘబా కాఫీ షాప్ లో బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో పది మంది కాఫీ షాప్ ఉద్యోగులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కిచెన్ లోని రెండు భారీ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. పేలుళ్ల సమాచారం తెలియగానే 40 మంది సివిల్ డిఫెన్స్ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. అయితే..ఎక్స్ ప్లోజన్స్ చోటు చేసుకున్న సమయంలో లక్కీగా కస్టమర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పేలుళ్లు సంభవించటంతో స్థానికులు అదిరిపడ్డారు. బ్లాస్ట్ జరిగినప్పుడు తాను సెకండ్ ఫ్లోర్ లో ఉన్నానని...శబ్ధం రాగానే వెంటనే కిందకి దిగి తప్పించుకున్నానని కాఫీ షాప్ లోని ఓ కస్టమర్ వెల్లడించాడు. బ్లాస్టింగ్ ధాటికి కొద్దిమందికి ఒళ్లంత రక్తంతో నిండిపోయిందని, మరికొందరికి కాలిన గాయాలు అవటం తాను ప్రత్యక్షంగా చూశానని వివరించాడు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..