తెలుగు రాష్ట్రాల్లో భూకంపం..

- January 26, 2020 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం..

తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి భూకంపం వచ్చింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన నాగులవంచ, తిమ్మనేనిపాలెం, బసవాపురం, పాతర్లపాడు.. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో అచ్చంపేట, తాళ్లచెరువు, కొత్తపల్లి గ్రామాలలో.. కృష్ణాజిల్లాలోని చందర్లపాడు, కంచికచెర్ల, వీరులపాడు, జగ్గయ్యపేట.. నందిగామ మండలాల్లో అర్ధరాత్రి 2.37 గంటల సమయంలో భూమి 10 సెకెన్ల పాటు భూమి కంపించింది.

ఇక దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదైంది. ఇంట్లోని వస్తువులు ఒక్కసారిగా కదలడంతో ప్రజలు భయాందోళనలతో బయటికి పరుగులు తీశారు. అయితే ఇవి చిన్న ప్రకంపనలేనని… వీటి వల్ల భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. కాగా, ఐదేళ్ల కిందట రిపబ్లిక్ డే రోజున ఇలాగే ఖమ్మంలోని పాతర్లపాడు, నాగులవంచ గ్రామాల్లో భూమి కంపించింది అక్కడి గ్రామస్థులు చెప్పడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com