వ్యాట్‌ చట్టానికి తుదిమెరుగులు

- January 19, 2016 , by Maagulf
వ్యాట్‌ చట్టానికి తుదిమెరుగులు

గల్ఫ్‌ అరబ్‌ స్టేట్స్‌ వాల్యూ యాడెడ్‌ ట్యాక్సెస్‌ (వ్యాట్‌) చట్టానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. 2018 నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పతనం నేపథ్యంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సుమారు 5 శాతం వ్యాట్‌ విధించే దిశగా గల్ఫ్‌ అరబ్‌ స్టేట్స్‌ సన్నాహాలు చేస్తున్నాయి. ఆరు నేషన్స్‌తో కూడిన గల్ఫ్‌ కో-ఆపరేషన్‌ కౌన్సిల్‌ ఈ వ్యాట్‌ని సంయుక్తంగా అమల్లోకి తీసుకురానుంది. జిసిసి సభ్యులు వీలైనంత త్వరగా దీన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. జూన్‌ 2014 నుంచి 60 శాతం మేర చమురు ధరలు పతనమయ్యాయి. దాంతో ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల కోసం గల్ఫ్‌ నేషన్స్‌ ప్రయత్నిస్తున్నాయి. గల్ఫ్‌ స్టేట్స్‌లో దేనికదే వ్యాట్‌ చట్టాన్ని రూపొందించుకోనున్నప్పటికీ, అన్ని నేషన్స్‌ ఓ అవగాహనతో దీన్ని ఇంప్లిమెంట్‌ చేస్తాయి. ఐదు శాతం వ్యాట్‌తో యూఏఈ 12 బిలియన్‌ దిర్హామ్‌లను సమకూర్చుకునే అవకాశం ఉంది. అయితే హెల్త్‌ కేర్‌, ఎడ్యుకేషన్‌, సోషల్‌ సర్వీస్‌ వంటి వాటిపై మాత్రం వ్యాట్‌ని ఇంపోజ్‌ చేయకూడదని భావిస్తున్నారు. 2016లో 13 శాతం ఆదాయం తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నడుమ వ్యాట్‌తో కొంతవరకు ఉపశమనం పొందవచ్చని గల్ఫ్‌ నేషన్స్‌ అనుకుంటున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com