అస్సాం ప్రజల కలలు సాకారంకు తాము సహకరిస్స్తాం : మోదీ

- January 19, 2016 , by Maagulf
అస్సాం ప్రజల కలలు సాకారంకు తాము సహకరిస్స్తాం : మోదీ

అస్సాం ప్రజల కలలు సాకారమయ్యేందుకు తాము సహకరిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం అస్సాం పర్యటనలో ఉన్న ఆయన కోక్రాఝార్‌లో బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కోక్రాఝార్‌కి ఏడాదిలోగా డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ రైలు రూటును పొడిగిస్తామన్నారు. తొందరలోనే భారత వైమానిక దళం, పౌరులు వాడుకునేందుకు వీలుగా అక్కడ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. గత పదిహేనేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. వారు అంత కాలంలో చేయలేని పనిని తాము 15 నెలల్లో చేసి చూపించామని చెప్పారు. దిల్లీ ఒక రూపాయి పంపిస్తుంటే 15 పైసలు మాత్రమే గ్రామాలకు చేరుతోందని రాజీవ్‌ చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే అస్సాం ప్రభుత్వం మాత్రం తాము చేసే ప్రతి పనికీ లెక్కలు చూపుతోందని పారదర్శకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. అస్సాం కోసం తన వద్ద ఉన్న ఒకే ఒక పథకం 'అభివృద్ధి' అని పేర్కొన్నారు. అక్కడ రోడ్డు, రైలు, వాయు మార్గాల్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com