D3లో దుబాయ్‌ పోలీస్‌ స్మార్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభం

- February 07, 2020 , by Maagulf
D3లో దుబాయ్‌ పోలీస్‌ స్మార్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభం

దుబాయ్‌ పోలీస్‌ జనరల్‌ హెడ్‌ క్వార్టర్స్‌, ఏడవ ఎస్‌పిఎస్‌ స్మార్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ని దుబాయ్‌ డిజైన్‌ డిస్ట్రిక్ట్‌ (డి3)లో ప్రారంభించడం జరిగింది. దుబాయ్‌ పోలీస్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ అబ్దుల్లా ఖలీఫా అల్‌ మర్రి మాట్లాడుతూ, స్మార్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ కొత్త పోలీస్‌ స్టేషన్‌ని ప్రారంభించినట్లు చెప్పారు. పోలీస్‌ విభాగంలో స్మార్ట్‌ ఆలోచనల దిశగా దేశ నాయకత్వం అడుగులు వేస్తోందనీ, ఈ క్రమంలోనే ఈ కొత్త స్మార్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు. ప్రపంచంలోని వివిధ దేశాలు దుబాయ్‌ స్మార్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ వ్యవస్థ పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయని అన్నారాయన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com