గాయకుడు ఏసుదాస్ సోదరుడు మృతి
- February 07, 2020
కేరళ:ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్ సోదరుడు కేజే జస్టిన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొచ్చిలోని బ్యాక్ వాటర్స్ వద్ద ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కొచ్చిన్ వల్లపాడమ్ కంటైనర్ టెర్మినల్ వద్ద ఆయన శవం తేలుతూ కనిపించింది. అయితే జస్టిన్ బుధవారం ఉదయం చర్చికి వెళ్లి.. రాత్రి వరకూ ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకగా.. వెతకగా... ఎంతకీ దొరక్కపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. బ్యాక్ వాటర్స్ వద్ద ఆయన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే జస్టిన్ కొడుకు అకాల మరణం చెందడం, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే జస్టిన్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. కేజే జస్టిన్ సంగీతకారుడు, రచయిత కూడా.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!