ఫోన్‌ స్కామ్: 200,000 దిర్హామ్ లు రికవరీ చేసిన దుబాయ్‌ పోలీస్‌

- February 12, 2020 , by Maagulf
ఫోన్‌ స్కామ్: 200,000 దిర్హామ్ లు రికవరీ చేసిన దుబాయ్‌ పోలీస్‌

ఫోన్‌ స్కామ్ కారణంగా 200,000 దిర్హామ్ లు పోగొట్టుకున్న బాధితుడికి దుబాయ్‌ పోలీసులు న్యాయం చేశారు. కేసు వివరాల్లోకి వెళితే, బాధితుడొకరు తన భార్య ఫోన్‌కి ‘200,000 దిర్హామ్ ల బహుమతి వచ్చింది’ అనే ఆడియో మేజేస్‌ రావడంతో, ఆ ఆడియో మెసేజ్‌లో పేర్కొన్న విధంగా ఐడీ, ఏటీఎం కార్డ్‌ వివరాల్ని పంపించారు. అయితే, బహుమతి రాకపోగా, తన అకౌంట్‌లో నుంచి డబ్బులు పోగొట్టుకున్నట్లు బాధితుడు ఆ తర్వాత గుర్తించడం జరిగింది. వెంటనే పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, బాధితుడు పోగొట్టుకున్న డబ్బుని రికవర్‌ చేయగలిగారు. ఈ సందర్భంగా పోలీసులకు బాధిత వ్యక్తి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 28 ఫ్రాడ్‌స్టర్స్‌, 13 ఇతర గ్యాంగ్‌లను ఈ తరహా ఫోన్‌ స్కావ్‌ులకు సంబంధించి అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com