2022 ప్యానెల్‌ రిక్రూటింగ్‌ మెంబర్స్‌

- January 21, 2016 , by Maagulf
2022 ప్యానెల్‌ రిక్రూటింగ్‌ మెంబర్స్‌

ఖతార్‌ రెసిడెంట్స్‌ 2022 ఫిఫా వరల్డ్‌ కప్‌ కోసం 'యూత్‌ ప్యానెల్‌' విభాగంలో అవకాశాలు దక్కించుకోవడానికి వీలు కల్పిస్తున్నారు. గతంలో 35 మంది సభ్యులతో ఓ గ్రూప్‌ని నియమించారు. సుప్రీం కమిటీ ఫర్‌ డెలివరీ అండ్‌ లెగసీ (ఎస్‌సి) ఈ ఏర్పాట్లు చేసింది. కొత్తగా ఇంకో గ్రూప్‌ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 2022 ఫిఫా వరల్డ్‌ కప్‌కి సంబంధించి ఔత్సాహికులైన యువత ఈ అవకాశాన్ని పొందవచ్చు. గతంలో ఏర్పాటు చేసిన గ్రూప్‌ ప్రతి నెలా శనివారం వర్క్‌ షాప్స్‌, ఇతర యాక్టివిటీస్‌ కోసం సమావేశమవుతుంది. టౌన్‌ ప్లానింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్‌ మరియు పలు అంశాలకు సంబంధించి ఆ గ్రూప్‌లోని యువత మెలకువల్ని నేర్చుకుంటుంది. కొత్త ప్యానెల్‌లో రెండు గ్రూపులు ఉంటాయి. అరబిక్‌ మరియు ఇంగ్లీషులో వర్క్‌షాప్స్‌ని నిర్వహించడం వీటి బాధ్యత. 15 నుంచి 21 ఏళ్ళ మధ్య వయస్కులైన ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లు పంపడానికి ఆఖరి తేదీ ఫిబ్రవరి 4. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com