వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు ' దిగితే దుబాయ్ లో 200 దిర్హమ్స్ జరిమానా

- January 21, 2016 , by Maagulf
వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు ' దిగితే దుబాయ్ లో 200 దిర్హమ్స్ జరిమానా

ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని ...విలాసంగా కారు నడుపుతూ తమలో తామే  మురిసిపోతూ  చిరునవ్వు క్షణాల్లో పులుముకొని తమ ఫోటో కోసం ఎదుటవారి ఫోటోకు దండ వేయించే ' సేల్ఫీలు ' దిగేపరమానందలయ్యాల పని  దుబాయ్  పోలీసులు ఇక పట్టనున్నారు వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు 'దిగితే దుబాయ్ లో 200 దినార్ల జరిమానాతో పాటు లైసెన్స్ పై నాలుగు నల్ల చుక్కలు పెడతారు. దీంతోకొంత కాలం డ్రైవింగ్ సంగతిని సదరు ఆ వాహన చోదకుడు మర్చిపోవాల్సిందే. తాను నడుపుతున్నవాహనం ద్వారా మరొకరికి  అసౌకర్యం కలిగించకూడదనే ఒక మంచి భావన అలవార్చుకోవాలన్నారు.    వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు ' తీస్తూ, ఎందరో తమ ప్రాణాలు పోగొట్టుకోవడమే కాక ఎదుటి వారినిసైతం చంపివేస్తున్నారని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయని దుబాయ్  పోలీసులువివరిస్తున్నారు. వాహనాలను నడుపుతూ మొబైల్ ఫోన్లలో మాట్లాడటం , సంక్షీప్త సమాచారంను ఫోన్లో చదవడం , ' సేల్ఫీలు ' తీయడం చట్ట ఉల్లంఘన నేరంగా నమోదు చేస్తారు. ఈ చర్యలు వాహనచోధకునిఏకాగ్రతను దెబ్బ తీయగలవని వారు తెలిపారు. 
               

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com