వుసూల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రోగ్రామ్ తో 60,000 మంది సౌదీ మహిళలకు లబ్ది

- February 20, 2020 , by Maagulf
వుసూల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రోగ్రామ్ తో 60,000 మంది సౌదీ మహిళలకు లబ్ది

రియాద్‌: 60,000 మందికి పైగా సౌదీ ఫిమేల్‌ ఎంప్లాయీస్‌, వుసుల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రోగ్రామ్ ద్వారా లబ్ది పొందారు. తమ రోజువారీ ప్రయాణాల కోసం ప్రోగ్రామ్ వారికి ఎంతగానో ఉపయోగపడింది. ప్రైవేట్‌ సెక్టార్‌లో పనిచేసే సౌదీ ఫిమేల్‌ వర్కర్స్‌కి, రవాణా ఖర్చులు తగ్గించేందుకోసం ఈ ప్రోగ్రామ్ ని అందుబాటులోకి తెచ్చారు. లైసెన్స్‌డ్‌ స్మార్ట్‌ అప్లికేషన్ల ద్వారా ట్యాక్సీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఈ ప్రోగ్రామ్ ని రూపొందించారు. లేబర్‌ మార్కెట్‌లో మహిళల సంఖ్యను పెంచడంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోందని హ్యామన్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com