యూఏఈలో మరో ఇద్దరికి కోవిడ్ -19 వైరస్..11కి చేరిన పేషెంట్ల సంఖ్య

- February 22, 2020 , by Maagulf
యూఏఈలో మరో ఇద్దరికి కోవిడ్ -19 వైరస్..11కి చేరిన పేషెంట్ల సంఖ్య

యూఏఈ:మహమ్మారిలా ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న కోవిడ్-19 వైరస్ ను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అంతకంతకు విస్తరిస్తూనే ఉంది. యూఏఈలో మరో ఇద్దరికి వైరస్ సోకినట్లు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ నిర్ధారించింది. 34 ఏళ్ల ఫిలిపినో వ్యక్తితో పాటు 39 ఏళ్ల బంగ్లాదేశీ వ్యక్తికి కోవిడ్ -19 రిపోర్ట్ లో  పాజిటీవ్ వచ్చినట్లు తెలిపారు. వైరస్ బారిన పడిన చైనీస్ పర్సన్స్ కు క్లోజ్ ఉండటంతో వారిద్దరికి కోవిడ్-19 సోకినట్లు చెబుతున్నారు. దీంతో యూఏఈలో కోవిడ్ - 19 కేసులు 11కి పెరిగాయి.

ఇందులో ముగ్గురు పూర్తిగా కోలుకున్నట్లు కూడా మినిస్ట్రి అధికారులు వెల్లడించారు.
అయితే..ఇప్పటికే వైరస్ బారిన పడిన వారి నుంచి ఇతరులకు వ్యాధి విస్తరించకుండా ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అండ్
ప్రివెన్షన్ తెలిపింది. వైరస్ సోకిన వ్యక్తులతో క్లోజ్ గా మూవ్ అయిన వారిపై కూడా తమ పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు వివరించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా వైరస్ వ్యాప్తి నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com