ట్రాఫిక్ జరీమానాలపై 100 శాతం డిస్కౌంట్, మళ్ళీ వచ్చిందోచ్!
- February 24, 2020దుబాయ్ పోలీస్, ట్రాఫిక్ ఫైన్ ఈనీషియేటివ్ని ఇంకోసారి ప్రకటించింది. జరీమానాలపై 100 శాతం డిస్కౌంట్ ఈ ఇనీషియేషన్ ప్రత్యేకత. ఫిబ్రవరి 6న మొదటి ఎడిషన్ పూర్తయిన వెంటనే, రెండో ఎడిషన్ అమల్లోకి వచ్చింది. గత ఏడాది ఈ ఇనీషియేషన్ ద్వారా 557,430 మంది మోటరిస్టులు జరీమానాల నుంచి ఉపశమనం పొందారు. కాగా, 546,970,930 దిర్హావ్ులు వాహనదారులకు మిగిలింది. కాగా, గత ఏడాది ట్రాఫిక్ మరణాలు 16 శాతానికి తగ్గాయి. మేజర్ ఇంజ్యురీస్ కూడా 38 శాతం తగ్గాయి. ఇదిలా వుంటే, ట్రాఫిక్ జరీమానాల డిస్కౌంట్ నుంచి 114,769 మంది పురుషులు, 444,661 మంది మహిళలు లబ్ది పొందినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మొదటి మూడు నెలల్లో ఉల్లంఘనలకు పాల్పడకపోతే 25 శాతం, ఆరు నెలలపాటు ఉల్లంఘనలకు పాల్పడనివారికి 50 శాతం డిస్కౌంట్, 9 నెలలపాటు ఉల్లంఘనలకు పాల్పడని పక్షంలో 75 శాతం, ఏడాది పాటు ఉల్లంఘనలకు పాల్పడకపోతే 100 శాతం అంతకు ముందు జరీమానాలపై డిస్కౌంట్ పొందేందుకు వాహనదారులకు అవకాశం కల్పిస్తున్నారు దుబాయ్ పోలీసులు.
తాజా వార్తలు
- అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
- టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..
- ఫుట్‌బాల్ ఆటగాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్‌కు 4 రోజులపాటు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎతిహాద్..!!
- చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!
- కువైట్‌లోని కార్మికుల్లో అగ్రస్థానంలో భారతీయులు..!!
- మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!
- ఖతార్ లో మెరైన్ టూరిజం ట్రాన్స్ పోర్ట్ నిబంధనల్లో మార్పులు..!!
- రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
- 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలో దీపావళి..