అబుధాబి: ఇండియన్ పాస్ పోర్ట్ రెన్యూవల్ స్పెషల్ డ్రైవ్
- February 25, 2020
అబుధాబి:ఇండియన్ పాస్ పోర్ట్ రెన్యూవల్ చేసేందుకు ఇండియన్ ఎంబసీ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ నెల 28(శుక్రవారం) రోజు రువైస్ హౌజింగ్, 1 గెస్ట్ హౌజ్ లోని సెకండ్ ఫ్లోర్ కాన్పరెన్స్ రూమ్ లో రెన్యూవల్ కార్యక్రమం చేపట్టనుంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. లాస్ట్ టోకెన్ మధ్యాహ్నం 3.00 గంటల వరకు ఇవ్వనున్నట్లు ఎంబసీ తన ప్రకటనలో తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రవాసీయులు సద్వినియోగం చేసుకోవాలని ఎంబీసీ అధికారులు కోరారు. మరింత సమాచారం కోసం పాస్ పోర్ట్, వీసా ప్రొసిజర్ అప్లికేషన్స్ కోసం ఎంబసీ వెబ్ సైట్ http://www.indembassyuae.gov.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. అలాగే 024492700 నెంబర్ కు ఆదివారం నుంచి గురువారం వరకు ఫోన్ చేసి వివరాలు తెలుకోవచ్చని తెలిపారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!