దుబాయ్‌లో ఆసియా కప్‌, పాల్గొననున్న భారత్‌ మరియు పాకిస్తాన్‌

- February 29, 2020 , by Maagulf
దుబాయ్‌లో ఆసియా కప్‌, పాల్గొననున్న భారత్‌ మరియు పాకిస్తాన్‌

కోలకతా: ఆసియా కప్‌ క్రికెట్‌ పోటీలు దుబాయ్‌లో జరుగుతాయి. భారత్‌ మరియు పాకిస్తాన్‌ ఈ పోటీల్లో పాల్గొంటాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో ఆసియా కప్‌ జరుగుతుంది. ఈ ఏడాది పాకిస్తాన్‌, ఆసియా కప్‌ని నిర్వహించాల్సి వున్నా, ఇరు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణ పూరిత వాతావరణం నేపథ్యంలో భారత క్రికెట్‌ జట్టు పాకిస్తాన్‌కి వెళ్ళడానికి వీల్లేకుండా పోయింది. కాగా, భారత్‌ - పాక్‌, 2019 వరల్డ్‌ కప్‌ పోటీల్లో తలపడ్డాయి. పాకిస్తాన్‌పై 89 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com