క్యామెల్‌ ట్రెక్‌: 10 రోజులు 500 కిలోమీటర్లు

- January 22, 2016 , by Maagulf
క్యామెల్‌ ట్రెక్‌: 10 రోజులు 500 కిలోమీటర్లు

హమాద్‌ బిన్‌ మహమ్మద్‌ హెరిటేజ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో క్యామెల్‌ ట్రెక్‌ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి పది రోజులపాటు ఈ క్యామెల్‌ ట్రెక్‌ కొనసాగనుంది. ప్రతి రోజూ 50 కిలోమీటర్ల మేర క్యామెల్‌ ట్రెక్కింగ్‌ ఉంటుంది. మొత్తం పదిరోజులు కావడంతో 500 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్‌ జరుగనుంది. ఉదయం 7.30 నిమిషాలకు ప్రారంభమయ్యే ట్రెక్కింగ్‌, మధ్యాహ్నం 12 గంటలకు విరామం తీసుకుంటుంది. రెండు గంటలపాటు విరామం అనంతరం తిరిగి ప్రారంభమై, సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. సాయంత్రం ట్రెక్కింగ్‌ ముగిశాక రాత్రి బస ఏర్పాట్లు టెంట్లలోనే ఉంటాయి. తిరిగి ట్రెక్కింగ్‌ ఉదయాన్నే ప్రారంభమవుతుంది. అందుబాటులో టెక్నాలజీ ఉండదు. ఇతరత్రా ఎలాంటి టెన్షన్లకు తావుండదు. కొత్త లోకంలోకి ఎంచక్కా ఎంటర్‌ అయిపోవచ్చు. యూఏఈ హెరిటేజ్‌ మరియు హిస్టరీని ప్రమోట్‌ చేసే దిశగా ఈ ట్రెక్కింగ్‌ చేపట్టినట్లు హెచ్‌హెచ్‌సి వర్గాలు చెప్పాయి. పెద్ద సంఖ్యలో ఈసారి ఎమిరేటీస్‌, వలసదారులు క్యామెల్‌ ట్రెక్‌లో ఉల్లాసంగా పాల్గొంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com