హైద్రాబాద్‌లో తొలి కరోనా వైరస్ కేసు నమోదు
- March 03, 2020
భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌లో కరోనా వైరస్‌కి సంబంధించి తొలి పాజిటివ్ కేసు నమోదయ్యింది. బాధితుడ్ని 24 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా గుర్తించారు. ఆఫీస్ వర్క్ నిమిత్తం ఇటీవల దుబాయ్‌కి వెళ్ళి వచ్చిన ఆ వ్యక్తి, అక్కడి నుంచి బెంగళూరుకి చేరుకున్నాడని పోలీసులు తెలిపారు. బెంగళూరులో రెండ్రోజులు ఆఫీస్‌కి వెళ్ళాడనీ, ఆ తర్వాత ఆయన హైద్రాబాద్ రావడం జరిగిందనీ, జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన అతనికి తొలుత స్వైన్‌ఫ్లూ అనే అనుమానంతో వైద్య చికిత్స అందించగా, ఫలితమివ్వకపోవడంతో గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. అక్కడే అతనికి కోవిడ్ (కరోనా వైరస్) పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ అని తేలింది. దుబాయ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ కొందరు విదేశీయుల్ని కలవడం వల్ల బాధితుడికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఇండియాకి వచ్చిన దగ్గర్నుంచి ఎవరెవర్ని అతను కలిశాడన్నదానిపై ఆరా తీస్తున్న అధికారులు, కొందరికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుంది.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!