'APNRTS' ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ

- March 04, 2020 , by Maagulf
'APNRTS' ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ

ఏ.పి:ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ సంస్థ  ఆంధ్రప్రదేశ్  నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టిఎస్)  ఆసక్తి కలిగిన అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగావకాశాలు కలిపిస్తోంది.  ఇప్పటికే రెండు బ్యాచుల అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి,  25 మందికి విదేశాల్లో ఉద్యోగాలు కల్పించింది. ఇప్పుడు మూడవ బ్యాచ్ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఆహ్వానిస్తోంది ఏపీఎన్ఆర్టిఎస్. గుంటూరు మరియు రాజంపేట  అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ఉచితంగా “ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్”  శిక్షణ  ఇచ్చి గల్ఫ్ దేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది ఏపీఎన్ఆర్టిఎస్.  రాష్ట్రంలోని నిరుద్యోగ యువత జీవన ప్రమాణాలు మెరుగుపరిచే  విధముగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణతో పాటు, ఉచిత ఆహారం, వసతి సౌకర్యాలు కల్పిస్తోంది. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు  అంతర్జాతీయ స్థాయి లో సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది. శిక్షణ పొందాలనుకునే  అభ్యర్థులు ఎస్.ఎస్.సి, ఐటిఐ, ఇంటర్ లేదా  ఏదైనా డిగ్రీ కలిగి ఉండవలెను.  ఔత్సాహిక నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం...ఉద్యోగాల పేరుతో దళారీల మాటలు నమ్మి మోసపోకండి. ప్రభుత్వం అందించే ఇటువంటి శిక్షణా కేంద్రాలు నుండి పొందే సర్టిఫికేట్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపీఎన్ఆర్టిఎస్ అధికారులు తెలిపారు.  నాలుగు  నెలల శిక్షణ మరియు అడ్మిషన్స్ కొరకు అభ్యర్థులు “వావిలాల సంస్థ”, 12/3 అరండల్ పేట, గుంటూరు, ఫోన్:  8500727678 మరియు “YSR ప్రవాసాంధ్ర సేవా కేంద్రం” బొయిన్ పల్లి, రాజంపేట, ఫోన్:  8500127678 నందు  సంప్రదించండి.  మరింత సమాచారం కొరకు ఏపిఎన్ఆర్టిఎస్ హెల్ప్ లైన్ నెంబర్లు  0863 2340678, 8500027678 ను సంప్రదించండి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com