కరోనా ఎఫెక్ట్ తో యూఏఈలో 4 వారాల పాటు స్కూల్స్, కాలేజీలు క్లోజ్
- March 04, 2020
యూఏఈ:మెరుపు వేగంతో విస్తరిస్తున్న కరోనా వైరస్ నియంత్రించేందుకు యూఏఈ అన్ని ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన యూఏఈ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్, కాలేజీలకు వచ్చే ఆదివారం నుంచి 4 వారాల పాటు సెలవులు ప్రకటించింది. ఇది దేశ వ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు వర్తిస్తుందని ట్వీట్ ద్వారా తెలిపింది. అంతేకాదు..ఎడ్యూకేషన్ ఇన్సిట్యూట్స్ లో శానిటైసింగ్ ప్రొగ్రాం చేపట్టింది. నిజానికి స్టూడెంట్స్ కి స్ప్రింగ్ వేకేషన్ మార్చి 29 నుంచి ఏప్రిల్ 12 వరకు ఉంది. కానీ, కరోనా వ్యాప్తితో వెకేషన్ ను మార్చి 8 నుంచి 29కి మార్చారు. ఇప్పటికే సిలబస్ అయిపోయిన నేపథ్యంలో పిల్లలకు ఇంటి దగ్గరే చదువుకునే వాతావరణం కలిపించాలని కూడా ప్రభుత్వం తన సర్క్యూలర్ లో తెలిపింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..