దుబాయ్:రోడ్ యాక్సిడెంట్ 29 ఏళ్ల NRI మృతి
- March 07, 2020
దుబాయ్ లో 29 ఏళ్ల ఎన్ఆర్ఐ రోడ్డు ప్రమాదం మృతి చెందాడు. శుక్రవారం ఉదయం తాము ప్రయాణిస్తున్న మినివ్యాన్ ను ఓ ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు ముహమ్మద్ సవాద్ సొంతూరు కేరళాలోని మళప్పురన్ జిల్లా. ప్రమాదం జరిగిన సమయంలో ముహమ్మద్ సవాద్ ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాడని..యాక్సిడెంట్ జరగ్గానే స్పాట్ లోనే అతను మరణించాడని సోషల్ వర్కర్ నసీర్ వతనపల్లి తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ మొహ్మద్ అబ్దుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను దుబాయ్ లోని ఎమిరాతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సవాద్, అబ్దుల్ ఇద్దరు అబుదాబిలోని రెస్టారెంట్లకు ఫిష్ సప్లై చేస్తుంటారు. ప్రమాదం జరిగిన సమయంలో కూడా ఓ రెస్టారెంట్ కు ఫిష్ సప్లై చేసి దుబాయ్ నుంచి అబుదాబికి తిరిగి వస్తున్నారని నసీర్ వెల్లడించారు. బాధితుల ఇద్దరి కుటుంబాలు యూఏఈలోనే ఉంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







