యూఏఈ పోలీసుపై మసాజ్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్ దాడి
- March 10, 2020
అజ్మన్ క్రిమినల్ కోర్ట్, 27 ఏళ్ల ఆఫ్రికా జాతీయుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కేసు వివరాల్లోకి వెళితే, నిందితుడు మసాజ్ కార్డుల్ని కారు విండ్ షీల్డ్‌లకు అతికిస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ క్రమంలో నిందితుడు, పోలీసులపైకి దాడికి దిగాడు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా బాధిత పోలీస్ అధికారి, తనను నిందితుడు కొట్టాడనీ, కొరికాడనీ పేర్కొన్నారు. విధి నిర్వహణలో వున్న పోలీస్ అదికారిపై దాడి చేసినందుకు న్యాయస్థానం నిందితుడికి 6 నెలల జైలు శిక్ష విధించడం జరిగింది. ఆసియా మహిళ ఒకరు తనకు మసాజ్ కార్డుల్ని డిస్ట్రిబ్యూట్ చేసే పని అప్పగించినట్లు తెలిపిన నిందితుడు, ఇందు కోసం తనకు 1000 దిర్హావ్‌ులు ఇచ్చినట్లు చెప్పాడు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







