దుబాయ్‌లో సాలిక్‌ ఫామ్స్ డిస్‌కంటిన్యూడ్‌

- March 10, 2020 , by Maagulf
దుబాయ్‌లో సాలిక్‌ ఫామ్స్ డిస్‌కంటిన్యూడ్‌

సాలిక్‌ ఫార్మ్స్ ని, సాలిక్‌ ట్యాగ్స్‌ కొనుగోలు చేసే సమయంలో రద్దు చేయబడ్తాయని దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ పేర్కొంది. క్లయింట్స్‌, సాలిక్‌ ట్యాగ్స్‌ని రిజిస్టర్‌ చేసుకోవడానికీ, యాక్టివ్‌ చేసుకోవడానికీ సాలిక్‌ పోర్టల్‌ లేదా స్మార్ట్‌ సాలిక్‌ అప్లికేషన్‌ని ఆశ్రయించాలని అధికారులు సూచించారు. ఇ-సర్వీసెస్‌ వినియోగం అలాగే పేపర్‌లెస్‌ విధానాన్ని అమలు చేసే క్రమంలో దుబాయ్‌ ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌, దుబాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ షేక్‌ హమదాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌవ్‌ు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సాలిక్‌ ట్యాగ్‌ని అథరైజ్డ్‌ డీలర్స్‌ లేదా సాలిక్‌ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా కొనుగోలు చేస్తే, సాలిక్‌ ట్యాగ్‌, ట్రాఫిక్‌ ఫైల్‌ నంబర్‌, మొబైల్‌ ఫోన్‌ వంటి వివరాలు ఎంటర్‌ చేయాల్సి వుంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ పూర్తికి సంబంధించిన సమాచారం క్లయింట్‌కి వెళుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com