వలసదారుల పట్ల మానవీయతను ప్రదర్శించిన అధికారికి సత్కారం

- March 11, 2020 , by Maagulf
వలసదారుల పట్ల మానవీయతను ప్రదర్శించిన అధికారికి సత్కారం

కువైట్:డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌, మినిస్టర్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ అనాస్‌ అల్‌ సలెహ్‌, కెపెఎ్టన్‌ మెషాల్‌ అల్‌ హజ్రిని సత్కరించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో సుభాన్‌ పోలీ క్లినిక్‌ వద్ద వేచి వున్న వలసదారులకు వాటర్‌ బాటిల్స్‌ని పంచి, మానవత్వం చాటుకున్నందుకు ఈ గౌరవం ఆయనకు లభించింది. ఇంటీరియర్‌ మినిస్ట్రీ అండర్‌ సెక్రెటరీ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఇస్సామ్ అల్‌ నహ్యాన్‌, అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ ఫర్‌ ట్రాఫిక్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మేజర్‌ జనరల్‌ హతెమ్ అల్‌ సయెగ్ ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటీరియర్‌ మినిస్ట్రీ బిల్డింగ్‌లోని మినిస్టర్‌ కార్యాలయంలో ఈ సన్మానం జరిగింది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com