దోహా: ఖతార్ లో థియేటర్స్, జిమ్, వెడ్డింగ్ వెన్యూస్ షట్ డౌన్

- March 13, 2020 , by Maagulf
దోహా: ఖతార్ లో థియేటర్స్, జిమ్, వెడ్డింగ్ వెన్యూస్ షట్ డౌన్

దోహా:కోరాలు చాచిన కరోనా వైరస్ పోరాటానికి ఖతార్ ప్రభుత్వం ముందస్తుగా జాగ్రత్త చర్యలు చేపట్టింది. కరోనా ఎఫెక్టెడ్ పర్సన్స్ నుంచి మీటర్ పరిధిలో ఉన్న ఇతరులపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. దీంతో వైరస్ ఇతరులకు సోకకుండా సొసైటీ గ్యాదరింగ్ పై ఆరోగ్య శాఖ అధికారులు అంక్షలు విధించారు. దేశంలో అన్ని సినిమా థియేటర్లు మూసివేయాలని సూచించారు. అలాగే చిల్డ్రన్స్ ప్లే జోన్స్, జిమ్స్, వెడ్డింగ్ వెన్యూస్ తో పాటు హోటల్స్ కూడా తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. మార్చి 13 నుంచి తాత్కాలిక మూసివేత అంక్షలు అమలులోకి వస్తాయి. సిటిజన్స్ అండ్ రెసిడెన్స్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మినిస్ట్రి ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధికారులు గుర్తు చేశారు. వీలైనంత వరకు క్రౌడెడ్ ప్లేసులకు వెళ్లకూడదని సూచించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సోషల్ గాదరింగ్ ఈవెంట్స్ ను వాయిదా వేసుకోవాలని కోరారు. ఆరోగ్యం సరిగ్గా లేనట్లు అనిపిస్తే అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని, ప్రజలంతా ప్రివెంటీవ్ మేజర్మెంట్స్ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. మూడు ఫీట్ల లోపు వైరస్ ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నందున ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వారికి దూరంగా ఉండాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. కోవిడ్19 పై సందేహాలు ఉన్నా..వైరస్ సోకినట్లు అనుమానం ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ 16000కు కాల్ చేయాలని తెలిపారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com