బహ్రెయిన్ వెళ్ళిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌

- January 23, 2016 , by Maagulf
బహ్రెయిన్ వెళ్ళిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ శనివారం బహ్రెయిన్‌ బయలుదేరి వెళ్లారు. ఇండియా-అరబ్‌ లీగ్‌ కోపరేషన్‌ ఫోరం తొలి సమావేశంలో పాల్గొనేందుకుగాను ఆమె అక్కడికిరెండు రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ రెండు రోజులూ ఆమె బహ్రెయిన్‌ రాజధాని మనామాలో విడిది చేయనున్నారు. అరబ్‌ లీగ్‌ దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం, ద్వైపాక్షిక సంబంధాల్ని బలోపేతం చేసుకునేందుకు ఆ దేశాల మంత్రులతో సమావేశాల్లో ఆవిడ పాల్గొననున్నారు. అలాగే ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఖాలీద్‌ బిన్‌ అహ్మద్‌ అల్‌ ఖలీఫాతో కూడా సమావేశమవుతారు. ఉగ్రవాదం, భద్రత, సౌదీ అరేబియా-ఇరాన్‌ గొడవలు తదితరాల గురించి ఆ సమావేశాల్లో చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com