హోమ్ క్వారెంటైన్‌ రూల్స్‌ అతిక్రమిస్తే డిపోర్టేషన్‌

- March 13, 2020 , by Maagulf
హోమ్ క్వారెంటైన్‌ రూల్స్‌ అతిక్రమిస్తే డిపోర్టేషన్‌

కువైట్: మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, సెక్యూరిటీ ఇన్‌స్పెక్షన్‌ క్యాంపెయిన్‌ని పలు ప్రాంతాల్లో చేపడ్తోంది. హోమ్ క్వారంటైన్‌ రూల్స్‌ని వలసదారులు అతిక్రమిస్తున్నారా.? అన్న అంశంపై ఈ క్యాంపెయిన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ రూల్స్‌ అతిక్రమిస్తున్నట్లు అధికారులు గుర్తిస్తే, ఉల్లంఘనుల్ని వెంటనే డిపోర్ట్‌ చేస్తారు. ప్రత్యేక సిస్టమ్ ద్వారా వలసదారుల సివిల్‌ ఐడీని పరిశీలిస్తారు. ఫిబ్రవరి 27కి ముందు ఆ తర్వాత ఆయా వలసదారుల ప్రయాణాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటారు. ఇదిలా వుంటే, మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, వలసదారులు దేశానికి వచ్చిన తర్వాత 14 రోజులపాటు హోమ్ క్వారెంటైన్‌లో వుండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com