దుబాయ్: ఆత్మహత్య చేసుకొని మరణించిన తెలంగాణ కార్మికుడు
- March 16, 2020
మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అండగా నిలిచిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC)
దుబాయ్: మెదక్ జిల్లా, హవేలీ గన్పూర్ మండలం, బూరుగుపల్లి గ్రామానికి చెందిన మరేల్లి పెరుమయ్య అనే కార్మికుడు మార్చి 3 వ తేదీన దుబాయి రావటం జరిగింది. అనుకోని కారణాల వల్ల మార్చి 10 వ తేదీన రెండు అంతస్థుల బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకొని అక్కడికక్కడే మరణించడం జరిగింది.
తోటి కార్మికులు ఈ విషయాన్ని 'గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC)' అధ్యక్షుడు గుండెల్లి నర్సింహాకి తెలపడంతో వెంటనే స్పందించి అక్కడికి వెళ్లి అన్ని విషయాలు తెలుసుకొని మరియు కంపెనీ మేనేజ్మెంట్ తో మట్లాడి కంపెనీ పూర్తి సహకారంతో అన్ని ఫార్మాలిటిస్ దగ్గరుండి పూర్తి చేయించి మృతదేహాన్ని ఇండియా పంపించడం జరిగింది. మరియు హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి వారి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది. అంతేకాకుండా, మానవతా దృక్పధంతో ఒక వ్యక్తిని కూడ మృతదేహం వెంట ఇండియా పంపించడం జరిగింది.

మృతదేహాన్ని ఇండియా కి తరలించడం లో సహకరించినవారు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండేల్లి నర్సింహా ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, దొనకంటి శ్రీనివాస్, పవన్ కుమార్, కనకట్ల రవీందర్,షేక్ వల్లి, మునిందర్, అశోక్ రెడ్డి, కట్ట రాజు, రాయిల్ల మల్లేశం, శరత్ గౌడ్, పేంట రఘు, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, పేనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భుమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్, సాయి మరియు సభ్యులు.
బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే గల్ఫ్ కార్మికుల చిరకాల వాంఛ అయినటువంటి T-NRI పాలసీని వెంటనే అమలు చేయాలని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి కోరుతున్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







