ఉమ్ అల్‌ కువైన్‌లో ట్రాఫిక్‌ జరీమానాలపై 50 శాతం తగ్గింపు

- March 20, 2020 , by Maagulf
ఉమ్ అల్‌ కువైన్‌లో ట్రాఫిక్‌ జరీమానాలపై 50 శాతం తగ్గింపు

ఉమ్ అల్‌ కువైన్‌: ఉమ్ అల్‌ కువైన్‌ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌, ట్రాఫిక్‌ జరీమానాలపై 50 శాతం తగ్గింపు అందుబాటులోకి తెచ్చింది. మార్చి 20 నుంచి మే 30 వరకు ఈ తగ్గింపు అమల్లో వుంటుంది. ట్రాఫిక్‌ జరీమానాలు, ట్రాఫిక్‌ పాయింట్స్‌, ఇంపౌండ్‌ వెహికిల్స్‌కి ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఉమ్ అల్‌ కువైన్‌ పోలీస్‌ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ కల్నల్‌ సయీద్‌ ఒబైద్‌ బిన్‌ అరన్‌ మాట్లాడుతూ, వాహనదారులపై జరీమానాల భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అభ్యర్థించారు. మార్చి 19కి ముందు జారీ అయిన జరీమానాలకు ఈ డిస్కౌంట్‌ వర్తిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌కి చెందిన స్మార్ట్‌ అప్లికేషన్స్‌ ద్వారా ఈ జరీమానాల చెల్లింపు చేయాల్సి  వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com