కరోనా ఎఫెక్ట్:ఎయిర్ కెనడా ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం
- March 20, 2020
టొరంటో:మహమ్మారి కరోనావైరస్ ప్రభావంతో ఎయిర్ కెనడా 5,000 మంది సిబ్బందిని తాత్కాలికంగా పనుల నుంచి తొలగించింది. ఏప్రిల్ 30 వరకూ లేఆఫ్స్ అమల్లో ఉంటాయని ఎయిర్ కెనడా పేర్కొంది. కాగా, పెద్దసంఖ్యలో ఎయిర్ కెనడా ఉద్యోగులను తొలగించడం విచారకరమని కెనడా ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (సీయూపీఈ) ఆందోళన వ్యక్తం చేసింది. యూనియన్లతో చర్చించే ఉద్యోగులను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించినట్టు కంపెనీ పేర్కొంది.
ఇక పరిస్థితులు మెరుగుపడిన అనంతరం తమ నెట్వర్క్ షెడ్యూల్‌ను ముమ్మరం చేసిన తర్వాత ఉద్యోగులు తిరిగి చురుకుగా తమ విధుల్లో పాల్గొంటారని తెలిపింది. డెడ్లీ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ అంతర్జాతీయ విమాన సర్వీసులను మార్చి 31 వరకూ దశలవారీగా రద్దు చేస్తామని అంతకుముందు ఎయిర్ కెనడా వెల్లడించింది.
తాజా వార్తలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!







