యూఏఈ:క్వారంటైన్ లో ఉన్న ఉద్యోగులకు జీతం చెల్లించాల్సిందే
- March 21, 2020
యూఏఈకి చెందిన కంపెనీలు తమ ఉద్యోగులకు క్వారంటైన్(స్వీయ నిర్బంధం) లో ఉన్న కాలంలో జీతం చెల్లించాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఉద్యోగులు స్వీయ నిర్బంధంలో ఉండాలని కంపెనీలు సూచిస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు కోవిడ్-19 లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఆయా కంపెనీలు క్వారంటైన్ గడువు కాలానికి కూడా జీతం చెల్లించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఫెడరల్ లా నెంబర్ 8,1980లోని ఆర్టికల్ 83(2) ప్రకారం క్వారంటైన్ కాలాన్ని సిక్ లీవ్ గా పరిగణించాల్సి ఉంటుంది. అయితే ప్రైవేట్ కంపెనీల విషయంలో మాత్రం ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గనిర్దేశకాలుగానీ, మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి మినిస్ట్రీయల్ ఆర్డర్స్ గానీ వెలువడలేదు. అయినా...కంపెనీల ఫోర్స్ తో ఉద్యోగులు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తే మాత్రం సిక్ లీవ్ గా పరిగణించాల్సి వస్తుంది. లేదంటే ఆర్టికల్ 83 ఉల్లంఘన కిందకి వస్తుందని మాత్రం అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఉద్యోగులే తమంతట తాము హోమ్ క్వారంటైన్ అయితే మాత్రం సిక్ లీవ్ గా పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు