కువైట్:భారత రాయబార కార్యాలయ శిబిరంలో ఇండియన్స్ కి మెడికల్ చెకప్

- March 21, 2020 , by Maagulf
కువైట్:భారత రాయబార కార్యాలయ శిబిరంలో ఇండియన్స్ కి మెడికల్ చెకప్

కువైట్:కువైట్ లోని భారత్ రాయాబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న ఇండియన్స్ కు మెడికల్ టెస్ట్ నిర్వహించారు. కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అయితే..ప్రస్తుతం శిబిరంలో ఉన్న వారందరు ఆరోగ్యంగానే ఉన్నారని కార్యాలయ అధికారులు తెలిపారు. వివిధ లీగల్ కారణాలతో కువైట్ లో చిక్కుకుపోయిన వారి కోసం ఇండియన్ ఎంబసీ షెల్టర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 66 మంది శిబిరంలో ఆశ్రయం పొందుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం చేపట్టిన కఠిన చర్యల నేపథ్యంలో వీళ్లంతా లీగల్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com