యూఏఈలో కరోనాతో తొలి మృతి కేసులు..ఇద్దరు చనిపోయినట్లు ప్రకటన
- March 21, 2020
యూ.ఏ.ఈ:కరోనా వైరస్ కోరలు చాస్తోంది. యూఏఈలో ఇన్నాళ్లు వ్యాప్తి వరకు పరిమితమైన కరోనా కేసుల్లో తొలిసారిగా మృత్యుఘంటలు మోగిస్తోంది. కరోనా వైరస్ కారణంగా దేశంలో ఇద్దరు చనిపోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ అధికారులు వెల్లడించారు. యూరప్ నుంచి వచ్చిన 78 ఏళ్ల అరబ్ వ్యక్తితో పాటు, యూఏఈలో ఉంటున్న 58 ఏళ్ల ఆసియా వ్యక్తి కరోనా వైరస్ కారణంగా మృతి చెందినట్లు ప్రకటించారు. యూరప్ నుంచి వ్యక్తికి కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది.
అయితే..చికిత్స తీసుకుంటున్న సమయంలో హార్ట్ అటాక్ రావటంతో అతను మృతి చెందినట్లు తెలిపారు. ఇక యూఏఈలో ఉంటున్న ఆసియా వ్యక్తి కరోనాతో కిడ్నీలు ఫెయిల్ అవటంతో మృతి చెందినట్లు వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన ఆ ఇద్దరి కుటుంబాలకు మినిస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది. కరోనా బారిన పడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







