ఒమన్:పుకార్లు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

- March 22, 2020 , by Maagulf
ఒమన్:పుకార్లు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

ఒమన్:పుకార్లు సృష్టించినా, సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వ కమ్యూనికేషన్ కేంద్రం హెచ్చరించింది. ప్రజా జీవనానికి భంగం కలిగించే ఏ చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. సాంకేతిక సమాచార నిబంధనలు ఉల్లంఘించేలా వ్యవహరించకూడదని అధికారులు సూచించారు. మతపరమైన విలువలను కించపరిచేలా, ప్రజా జీవనానికి భంగం కలిగించేలా అపోహలు, అసత్య ప్రచారాలు సృష్టించినా, ప్రచారం చేసినా చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రభుత్వ కమ్యూనికేషన్ కేంద్రం వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నెలకు తగ్గకుండా మూడు నెలలకు మించకుండా జైలు శిక్ష తప్పదని అధికారులు హెచ్చరించారు. అలాగే OMR1,000 కి తగ్గకుండా OMR3000కి ఎక్కువ కాకుండా జరిమానా విధిస్తామని కూడా అధికారులు హెచ్చరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com