దుబాయ్ : Dh700,000 చోరీ కేసులో దోపిడి గ్యాంగ్ ను కోర్టులో హజరు పర్చిన పోలీసులు
- March 22, 2020
దుబాయ్ లో దాదాపు Dh700,000 మేర సొమ్మును దోచుకున్న దోపిడి దొంగల గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హజరుపరిచారు. గతేడాది డిసెంబర్ 16న దుబాయ్ లోని అల్ క్వాజ్ ఏరియాలో ఈ దోపిడి జరిగింది. రెండు కార్లలో వచ్చిన ఏడుగురు నగదు బదిలీ వాహనాన్ని అటకాయించి చోరీకి పాల్పడ్డారు. కార్లను నగదు బదిలీ వాహనానికి అడ్డుగా పెట్టి తమను కత్తులు, ఇనుప రాడ్లతో బెదిరించినట్లు డ్రైవర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కోర్టుకు వివరించారు. దొంగల్లో ఒకరు తన మెడపై కత్తి పెట్టి డబ్బును ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారని, లేదంటే పీక కోసేస్తానంటూ బెదిరించారని తెలిపాడు. ఇక చేసేది లేక నిస్సాయంగా డబ్బును దొంగలకు అప్పగించాల్సి వచ్చిందని వివరించారు. అయితే..ఒక కేసులో దొంగలు ఒకరు దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా షార్జా ఇంటర్నేషనల్ కోర్టులో అతన్ని అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంకో ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారు. అయితే..చోరీ సొత్తును పంచుకోగా తన వాటా Dh8000 మాత్రమే వచ్చిందని నిందితుల్లో ఒకరు కోర్టు తెలిపాడు. ఈ తదుపరి విచారణ ఏప్రిల్ 22కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







