యూ.ఏ.ఈ:వర్క్ పర్మిట్లు,రెసిడెన్స్ వీసాలు ఆటోమేటిక్ గా జారీ చేయబడతాయి

- March 26, 2020 , by Maagulf
యూ.ఏ.ఈ:వర్క్ పర్మిట్లు,రెసిడెన్స్ వీసాలు ఆటోమేటిక్ గా జారీ చేయబడతాయి

యూ.ఏ.ఈ:మానవ వనరులు & ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ మరియు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ & సిటిజన్‌షిప్, వర్క్ పర్మిట్ గడువు ముగిసిన కార్మికులకు వైద్య పరీక్షల మినహాయింపును ప్రకటించింది.

కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి యూ.ఏ.ఈ ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా కంపెనీలు,కార్మికుల వంటి సహాయక సేవా సిబ్బందికి పనిచేసే అనుమతులు మరియు రెసిడెన్స్ వీసాలు ఆటోమేటిక్ గా జారీ చేయబడతాయి మరియు పునరుద్ధరించబడతాయి.

కొత్త చర్యల ప్రకారం, కార్మికులు యూ.ఏ.ఈ దేశవ్యాప్తంగా వైద్య పరీక్షా కేంద్రాలకు వెళ్లవలసిన అవసరం లేదు.అటువంటి సేవలకు ఫీజులు అధీకృత చెల్లింపు మార్గాల ద్వారా సేకరించబడతాయి.ఫీజు చెల్లించిన తర్వాత, కార్మికులు యూ.ఏ.ఈ యొక్క చట్టబద్ధమైన నివాసితులుగా ఉంటారు.

ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ & సిటిజెన్షిప్ వ్యాపార యజమానులను తమ కార్మికులలో కోవిడ్ -19 యొక్క ఏదైనా అనుమానాస్పద కేసును నివేదించమని కోరింది. యూ.ఏ.ఈలోని కార్మికులందరూ తమ సొంత భద్రత కోసం మరియు సమాజ భద్రత కోసం ముందుజాగ్రత్త సూచనలను పాటించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com