కర్‌ఫ్యూ ప్రపోజల్‌కి ఆమోదం
- March 26, 2020
బహ్రెయిన్:కరోనా వైరస్ (కోవిడ్ 19) తీవ్రతకు అడ్డుకట్ట వేసేందుకోసం పాక్షిక కర్‌ఫ్యూ విధించేందుకోసం బహ్రెయిన్ కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ ఓ నిర్ణయాన్ని ఆమోదించింది. ప్రభుత్వం నుంచి ‘గో-ఎహెడ్’ నిర్ణయం కోసం ఈ ప్రపోజల్ ఎదురుచూస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, కింగ్‌డమ్లోని ప్రతి ఒక్కరూ రాత్రి 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు తమ ఇళ్ళకే పరిమితం కావాల్సి వుంటుంది. దీనికి సంబంధించి కొన్ని వెసులుబాట్లు కూడా వున్నాయి. ఇల్లీగల్ వర్కర్స్‌కి గ్రేస్ పీరియడ్ ఇచ్చి, తమ దేశానికి వెళ్ళిపోయేందుకు అనుమతించడం, కోవిడ్-19ని ఎదుర్కొనేందుకు ఫండ్ ఏర్పాటు చేసి, నిధుల్ని, డొనేషన్లను ఆకర్షించడం, ఇంటి నుండి పని అమలు చేసేలా కంపెనీలకు దిశా నిర్దేశం చేయడం, కరోనా వైరస్‌పై పోరులో బాగంగా వాలంటీర్లకు ఇన్సెంటివ్ బోనస్ ఇవ్వడం, ఆర్థిక ప్యాకేజీని సంబంధిత ప్రైవేట్ సెక్టార్ కోసం ప్రకటించడం, స్టూడెంట్స్ తరహాలో టీచర్లకు సెలవులు ప్రకటించడం వంటి ఆలోచనల్ని ఈ నిర్ణయంలో పొందుపరిచారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







