సైన్యానికి ఆ బాధ్యత అప్పగించిన స్పెయిన్...
- March 30, 2020
కరోనా వలన యూరప్ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. చైనా తరువాత యూరప్ లోకి ప్రవేశించిన కరోనా అక్కడి నుంచి విలయతాండవం చేస్తున్నది. ఇటలీ, స్పెయిన్ దేశాలలో వైరస్ బారిన పడుతున్న వ్యక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. వైరస్ నుంచి బయటపడేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్ అక్కడ చాలా వరకు కట్టడి అయ్యింది. యూరప్, అమెరికా దేశాల్లో మాత్రం అదుపు చేయలేకపోతున్నారు.
స్పెయిన్ లో చేయి దాటిపోవడంతో ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ విధించడంతో పాటుగా ప్రజలను కంట్రోల్ చేసే బాధ్యతను ప్రభుత్వం సైన్యానికి అప్పగించింది. అంతేకాదు, దీనికి సంబంధించి విశేషాధికారాలు సైన్యానికి ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. దీంతో ఇప్పుడు ఆ దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైరస్ ను కట్టడి చేయడానికి స్పెయిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజున స్పెయిన్ లో ఏకంగా 6300 మంది కరోనా బారిన పడ్డారు. సామాజిక దూరం పాటించకుంటే మరింత దేశం మరింత తీవ్రమైన ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!