హమాలాలో అగ్ని ప్రమాదం

- April 01, 2020 , by Maagulf
హమాలాలో అగ్ని ప్రమాదం

బహ్రెయిన్‌: హమాలా ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కార్పెంటరీ షాప్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఆ తర్వాత పక్కనే వున్న మరో మూడు షాప్స్‌కి అగ్ని కీలలు వ్యాపించాయి. 6 వాహనాల్లో 18 మంది ఫైర్‌ ఫైటర్స్‌ రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు వెల్లడించడం జరిగింది.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com