ట్రాఫిక్‌ సర్వీసెస్‌ కోసం ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ తప్పనిసరి

- April 03, 2020 , by Maagulf
ట్రాఫిక్‌ సర్వీసెస్‌ కోసం ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ తప్పనిసరి

బహ్రెయిన్:జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌, స్మార్ట్‌ ఫోన్‌ అప్లికేషన్‌ స్కిప్లినో ద్వారా అపాయింట్‌మెంట్‌ పొందిన తర్వాతే, వ్యక్తిగతంగా హాజరై ఆయా సేవలు పొందడానికి వీలవుతుందని స్పష్టం చేసింది. హెడ్‌క్వార్టర్స్‌, డ్రైవింగ్‌ లెర్నింగ్‌ డైరక్టరేట్స్‌ అలాగే ముహరాక్‌లోని సెక్యూరిటీ కాంప్లెక్స్‌లో పెద్ద మొత్తంలో జనం గుమికూడకుండా ఈ విధాన్ని అమలు చేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని తగ్గించడంలో భాగంగా ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇ-ట్రాఫిక్‌ అప్లికేషన్‌ని గవర్నమెంట్‌ పోర్టల్‌ (బహ్రెయిన్‌ డాట్‌ బిహెచ్‌) ద్వారా 24 గంటలూ సర్వీసెస్‌ని ప్రాసెస్‌ చేసుకోవచ్చు. వాహనాల నెంబర్‌ ప్లేట్లకు సంబంధించి ఓనర్‌షిప్‌ ట్రాన్స్‌ఫర్‌, డ్రైవింగ్‌ లెర్నింగ్‌ లైసెన్స్‌ రీప్లేస్‌మెంట్‌, నెంబర్‌ ప్లేట్స్‌, కొత్త వాహనాలకు డ్రైవింగ్‌ లెర్నింగ్‌ లైసెన్సుల రద్దు సర్టిఫికెట్స్‌, ఐ టెస్టులు అవసరమైన గ్రూప్స్‌కి సంబంధించి డ్రైవింగ్‌ లైసెన్సుల రెన్యువల్‌ వంటివి ఈ విభాగంలోకి వస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com