కరోనాను ఎదుర్కొనేందుకు రోగనిరోధక ప్లాస్మాను సిద్ధం చేస్తున్న కువైట్
- April 08, 2020
కువైట్: కువైట్ లోని 'బ్లడ్ బ్యాంకు' కరోనాను ఎదుర్కోవటానికి రోగనిరోధక ప్లాస్మాను తయారుచేయడం ప్రారంభించినట్లు ప్రకటించింది. "ఇది వైరస్ నుండి కోలుకుంటున్న దాతల నుండి సేకరించి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తయారు చేయబడుతుంది. ఒక దాత 3 రోగులకు చికిత్స చేయడానికి ఉపయోగపడతారు" అని బ్లడ్ బ్యాంక్ వద్ద రక్త మార్పిడి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ రీమ్ అల్-రాద్వాన్ తెలిపారు.
వైరస్ ఎదుర్కొన్నప్పుడు సోకిన వ్యక్తి యొక్క శరీరం వ్యాధిని అధిగమించడానికి ప్రతిరోధకాలను ఏర్పరచడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో కోలుకున్న వ్యక్తి ప్లాస్మా రోగి కి అందించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీంతో రోగికి రోగనిరోధక శక్తిని పెంపొందించగలం. రోగి యొక్క రక్త ప్లాస్మాలోని ప్రతిరోధకాలు మూడు వారాల పాటు అధిక స్థాయిలో ఉండి తరువాత తగ్గుతాయి కాబట్టి ప్రతి దాతకు ఒక నిర్దిష్ట కాలపరిమితి నిర్దేశించబడుతుంది. ముగ్గురు రోగులకు చికిత్స చేయడానికి ఒక దాత దోహదం చేస్తారని ఆమె వివరించారు.
ప్రస్తుతం ప్లాస్మాను 'జాబ్రియా' లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లో దానం చేసినట్లు తెలుస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?