ఒమన్ సుల్తాన్‌కు మోదీ ఫోన్..భారతీయుల క్షేమంపై ఆరా
- April 08, 2020
ఢిల్లీ: కరోనా కట్టడికి భారత్-ఒమన్ దేశాలు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారీక్ చర్చించారు. మంగళవారం ప్రధాని మోదీ సుల్తాన్ హైతమ్ బిన్ తారీక్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒమన్‌లో ఉన్న భారతీయుల సంక్షేమం గురించి వ్యక్తిగత శ్రద్ధ చూపుతున్నందుకు ఒమన్ సుల్తాన్‌కు కృతజ్ఞతలు తెలిపినట్లు ప్రధాని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. ఇరు దేశాధినేతలు కరోనా కారణంగా ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఫోన్ ద్వారా చర్చించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. దానితో పాటు సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రెండు దేశాలు పరస్పర సహకారానికి అంగీకారం తెలిపినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒమన్‌లో ఉన్న భారతీయుల భద్రత గురించి ప్రధాని మోదీకి ఒమన్ సుల్తాన్ హామీ ఇచ్చారు. అలానే భారత్‌లో ఉన్న ఒమన్ దేశస్తులకు భారత ప్రభుత్వం అందించిన సహకారానికి ఆయన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల మరణించిన ఒమన్ సుల్తాన్ ఖబూస్ మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. కొత్తగా పాలన కొనసాగిస్తున్న సుల్తాన్ హైతమ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
-- లెనిన్ కుమార్, మాగల్ఫ్ ప్రతినిధి, ఒమాన్
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







