దోహా:హాట్ లైన్ నెంబర్ ప్రారంభించిన జాతీయ మానవ హక్కుల సంఘం

- April 10, 2020 , by Maagulf
దోహా:హాట్ లైన్ నెంబర్ ప్రారంభించిన జాతీయ మానవ హక్కుల సంఘం

దోహా:ఖతార్ లోని పౌరులు, ప్రవాసీయుల హక్కుల పరిక్షణ, పలు సమస్యాత్మక సందర్భాల్లో సూచనలు చేసేందుకు జాతీయ మానవ హక్కుల సంఘం మరింత చొరవ తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా అన్ని రీజియన్ల ప్రజలకు అందుబాటులో ఉండేలా హాట్ లైన్ నెంబర్ 8002222 ప్రారంభించింది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఈ హాట్ లైన్ కాల్ సెంటర్ కార్మికులకు నిరంతరాయంగా సేవలు అందించనుంది. మొత్తం ఐదు భాషల్లో సేవలను అందించేలా ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్, అరబిక్, ఉర్దూతో పాటు భారత్, నేపాల్, శ్రీలంకన్లను భాషలను కూడా కవర్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో కాల్ సెంటర్ కు కాంటాక్ట్ అవటం ద్వారా పౌరులకు తగిన సాయం అందించగలమని NHRC పౌర సంబంధాల ప్రధాన అధికారి తెలిపారు. కరోనా మహమ్మారి పరిస్థితుల తర్వాత కూడా NHRC కాల్ సెంటర్ తన సేవలను అందిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. 

--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com