మస్కట్:రెండు హ్యాండ్ శానిటైజర్ బ్రాండ్లను నిషేధించిన ఒమన్
- April 12, 2020
మస్కట్:కరోనా వైరస్ సీజన్ లో హ్యాండ్ శానిటైజర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. వైరస్ నుంచి రక్షించుకోవాలంటే పదే పదే చేతులు శుభ్రం చేసుకోవాలని డాక్టర్లు చెబుతుండటంతో జనం శానిటైజర్లను ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఇదే అదనుగా నాసిరకం శానిటైజర్ బ్రాండ్లు కూడా మార్కెట్లోకి వచ్చిపడుతున్నాయి. అలాంటి నకిలీ బ్రాండ్లపై ఓ కన్నేసి పెట్టిన ఒమన్ ప్రభుత్వం లేటెస్ట్ రెండు హ్యాండ్ శానిటైజర్ బ్రాండ్లపై నిషేధం విధించింది. పర్ఫెక్ట్, క్లీన్ టచ్ హ్యాండ్ శానిటైజర్ జల్ అనే రెండు బ్రాండ్ల అమ్మకాలను తమ దేశంలో నిషేధిస్తున్నట్లు ఒమన్ ప్రకటించింది. ఈ రెండు బ్రాండ్లు తయారీలో తగిన నాణ్యాతా ప్రమాణాలు పాటించలేదన్నది ఒమన్ వాదన. ఈ రెండు బ్రాండ్ల శానిటైజర్ లు శరీరంపై దుష్ప్రభావం చూపిస్తున్నాయని, తలనొప్పి, స్కిన్ ఇరిటేషన్, బడలికగా లక్షణాలు కనిపిస్తున్నాయని ఒమన్ ప్రభుత్వం చెబుతోంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







