జీవితాంతం వారికి రుణపడి ఉంటా:బోరిస్ జాన్సన్
- April 12, 2020
లండన్:తనకు చికిత్స అందించిన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటానని కరోనా నుంచి కోలుకొని ఐసీయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తొలి వ్యాఖ్యల్లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. వారం రోజుల క్రితం బోరిస్ కరోనా లక్షణాలతో సెంట్రల్ లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్‌లో చేరారు. అయితే వ్యాధి లక్షణాలు ఎక్కువకావడంతో ఆయన్ని ఏప్రిల్ 6వ తేదీన ఐసీయూలో ఉంచి చికిత్స అందించి.. ఏప్రిల్ 9వ తేదీన జనరల్ వార్డుకు మార్చారు. శుక్రవారం నాటికి ఆయన స్వయంగా లేచి నడిచారని.. ఆయన ఆరోగ్యం క్రమంగా కుదటపడుతుందని ఆయన అధికారిక కార్యాలయం వెల్లడించింది.
అయితే తనకు వైద్యం అందించిన వాళ్లకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని బోరిస్ అన్నారు. వాళ్లు నాకు చేసిన సేవకు కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు. నా జీవితాంతం వారికి రుణపడి ఉంటాను అని ఆయన తెలిపారని.. హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







