తల్లితండ్రులకు పాఠశాల ఫీజులపై ప్రభుత్వ సహాయం

- April 12, 2020 , by Maagulf
తల్లితండ్రులకు పాఠశాల ఫీజులపై ప్రభుత్వ సహాయం

అబుధాబి/యూఏఈ: కరోనా తో నిత్యజీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాగే ఆర్ధికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో పిల్లల స్కూల్ ఫీజులు తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా నిలుస్తున్నాయి. ఈ పరిస్థితిని అర్ధం చేసుకొని అబుధాబి ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్ల తల్లితండ్రులకు ఊరటనందించే ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుత ఆర్థిక సవాళ్ళతో బాధపడుతున్న అబుధాబి లోని తల్లిదండ్రులు తమ పిల్లల పాఠశాల ఫీజు చెల్లించడంలో అధికారుల సహాయం తీసుకోవచ్చు అని ఆదివారం అబుధాబి మీడియా కార్యాలయం ట్విట్టర్‌లో ప్రకటించారు. ఆర్ధిక సహాయం లేదా దూరవిద్యకు ఉపయోగపడే లాప్ టాప్ లు అందించటం జరుగుతుంది అని 'అథారిటీ ఫర్ సోషల్ కంట్రిబ్యూషన్ - మాన్' మరియు 'అబుదాబి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ (అడెక్)'  తెలిపారు. ఈ చర్య 'టుగెదర్ వి ఆర్ గుడ్' కార్యక్రమంలో భాగం అని తెలుస్తోంది.

ఈ సహాయం పొందటం ఎలా?
తల్లిదండ్రులు టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌కు 800-3088 నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా వారి అభ్యర్థనను http://togetherwearegood.ae లో నమోదు చేసుకోవచ్చు. ఫీజు సహాయ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 23, 2020 అని మీడియా కార్యాలయం ట్వీట్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com