కరోనా: దుబాయ్ నుండి వెళ్తున్నవారికి పాస్పోర్ట్లలో వీడ్కోలు సందేశంతో స్టిక్కర్లు

- April 13, 2020 , by Maagulf
కరోనా: దుబాయ్ నుండి వెళ్తున్నవారికి పాస్పోర్ట్లలో వీడ్కోలు సందేశంతో స్టిక్కర్లు

 

దుబాయ్: కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య విమానాలు ఆగిపోయినప్పటి నుండి, వేలాది మంది ప్రజలు ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయారు. దుబాయ్ ప్రవాసీయులను స్వదేశాలకు పంపుతుండటంతో ప్రజలు ఇప్పుడు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరుతున్నారు. వీరికి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక చక్కని సందేశాన్ని 'ఫేర్వెల్ స్టిక్కర్' రూపంలో వారి పాస్పోర్ట్ లలో జతకలిపి వీడ్కోలు పలుకుతున్నారు. 

"మీరు సురక్షితంగా ప్రయాణించాలని ఆశిస్తున్నాము...త్వరలో మళ్ళీ కలుద్దాం" అంటూ సందేశాన్ని కలిగి ఉన్న ఈ స్టిక్కర్లను దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ ప్రారంభించింది.

ప్రవాసీయులు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు బుకింగ్‌లను ఏప్రిల్ 2 గురువారం నుండి అనుమతించారు. ఎమిరేట్స్ ప్రస్తుతం దుబాయ్ నుండి లండన్, బ్రస్సెల్స్, ఫ్రాంక్‌ఫర్ట్, పారిస్ మరియు జ్యూరిచ్‌లకు విమానాలను నడుపుతోంది, అయితే ప్రయాణికులు మరియు సిబ్బంది విమానంలో ప్రయాణికునికి-ప్రయాణీకునికి మధ్య ఉండాల్సిన దూరం నిబంధనలను పాటించేలా కఠినమైన విధానాలు అమలులో ఉన్నాయి. జకార్తా, మనీలా, తైపీ, చికాగో మరియు కాబూల్ లకు కొత్త విమానాలను నడుపుతున్నట్లు సోమవారం ఎయిర్లైన్స్ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com