7000 మంది వలస కార్మికుల కోసం 3 తాత్కాలిక కేంద్రాలు

- April 16, 2020 , by Maagulf
7000 మంది వలస కార్మికుల కోసం 3 తాత్కాలిక కేంద్రాలు

కువైట్‌: కువైట్‌ నేషనల్‌ పెట్రోలియం కంపెనీ (కెఎన్‌పిసి), 7000 మంది కార్మికుల కోసం మూడు తాత్కాలిక సెంటర్స్‌ని దేశంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. కెఎన్‌పిసి డిప్యూటీ చైర్మన్‌ ఆఫ్‌ ప్రాజెక్ట్స్‌ అలాగే అధికార ప్రతినిది¸ అయిన అబ్దుల్లా అల్‌ అజ్మి మాట్లాడుతూ, కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశం తీసుకుంటోన్న చర్యలు, దేశ నాయకత్వం చేసిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అల్‌ అర్దియా, అల్‌ జహ్రా అలాగే సౌత్‌ అల్‌ సభియా ప్రాంతాల్లో ఈ సెంటర్స్‌ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. కార్మికులు నివసించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాల్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం సూచనల మేరకు పనిచేస్తామని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com