గవర్నమెంట్ సెక్టార్లో వలసదారులకు స్థానం కల్పించొద్దు
- January 27, 2016
గవర్నమెంట్ సెక్టార్లో వలసదారులకు స్థానం కల్పించవద్దంటూ ఎంపీ, మినిస్టర్ అభిప్రాయపడ్డారు. గుడైబియాలో జరిగి కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ సమావేశంలో 'వలసదారులకు గవర్నమెంట్ సెక్టార్లో అవకాశం' అనే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ఎంపీ జలాల్ కదీమ్ ప్రశ్నకు గవర్నమెంట్ సమాధానమిచ్చింది. నాన్ బహ్రెయినీలకు పబ్లిక్ సెక్టాల్లో కల్గించిన అవకాశాల గురించి ప్రస్తావించారు. 99 శాతం గవర్నమెంట్ ఉద్యోగాల్లో బహ్రెయినీలకే అవకాశం కల్పించామని మినిస్టర్ పేర్కొన్నారు. 600 కంటే తక్కువ మంది వలసదారులు ఇటీవల పబ్లిక్ సెక్టార్లో ఉద్యోగాలు పొందారనీ, వీరి శాతం 1 కన్నా తక్కువే ఉంటుందని, 48,000 మంది మొత్తంగా ఈ సెక్టార్లో ఉద్యోగులున్నారని చెప్పారు. ఎంపీ ఖదీమ్ ఈ సమాధననాన్ని ఖండించారు. 2,000 వలస టీచర్లు గత ఏడాదిలో ఉద్యోగం పొందారనీ, 8,000 మంది మొత్తం ఉన్నారని చెప్పారు. మెడికల్ ఉద్యోగాల్లో కూడా వలసదారుల సంఖ్య పెరిగిందని ఆయన అన్నారు. ఎంపీ ఖదీమ్, గంటకు పైగా సమావేశం నుంచి వాకౌట్ చేశారని మినిస్టర్ సమాధానినికి నిరసనగా ఖదీమ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలియవస్తుంది.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









