కరోనా/రస్ అల్ ఖైమా: కార్మికుల రాకపోకలపై షరతులు

- April 19, 2020 , by Maagulf
కరోనా/రస్ అల్ ఖైమా: కార్మికుల రాకపోకలపై షరతులు

యూఏఈ: రస్ అల్ ఖైమా కార్మికులు ఇతర ఎమిరేట్ లకు వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాస్ అల్ ఖైమా ఎమిరేట్ పరిధిలో మాత్రమే కార్మికులను రవాణా చేయవచ్చని RAK ట్రాన్స్పోర్ట్ అథారిటీ జనరల్ మేనేజర్ ఎస్మాయిల్ హసన్ అల్ బ్లూషి అన్నారు. కార్మికుల, పౌరుల ఆరోగ్య భద్రత తమ లక్ష్యమని వివరించారు. ఒక వేళ ఎవరైనా నిబంధనలను ఖాతరు చేయకుంటే వారిపై జరిమానా విధిస్తామని కూడా ఆయన హెచ్చరించారు. అలాగే కార్మికులు తరలించే సమయంలో రవాణ వాహనంలోని సామార్ధ్యానికి సగానికి మాత్రమే కార్మికులను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కార్మికులు తప్పసరిగా మాస్కులు ధరించటంతో పాటు సామాజిక దూరాన్ని పాటించాలని కూడా బ్లూషి అన్నారు.

కరోనా ను కట్టడి చేయటంలో అబుధాబి, దుబాయ్, షార్జా కూడా ఇదే కోవలో కార్మికుల రాకపోకలపై షరతులు విధించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com