మూడు స్టోర్స్‌ని సీజ్ చేసిన మినిస్ట్రీ
- April 27, 2020
కువైట్:కువైట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మూడు స్టోర్స్‌ని సీజ్ చేసినట్లు వెల్లడించింది. కరోనా వైరస్‌ని అరికట్టే క్రమంలో విధించిన నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ఈ స్టోర్స్‌పై అభియోగాలు మోపబడ్డాయి. మినిస్ట్రీకి చెందిన టీమ్స్, 182 కన్స్యుమర్ కో-పరేటివ్స్పై సోదాలు నిర్వహించారు. షాపింగ్ మాల్స్, వెజిటబుల్ స్టోర్స్లపైనా తనిఖీలు నిర్వహించారు. ధరలు సహా అనేక అంశాలకు సంబంధించి ఈ సోదాలు జరిగాయి. ఫుడ్ రేషన్స్ డెలివరీ అలాగే 64 రేషనింగ్ సెంటర్స్‌ని కూడా తనిఖీలు చేశారు. కాగా, మినిస్ట్రీకి చెందిన ఎమర్జన్సీ సెంటర్ 231 ఫిర్యాదుల్ని హాట్‌లైన్ 135 ద్వారా అందుకోవడం జరిగింది. సూపర్విజన్ సెంటర్‌కి 30 ఫిర్యాదులు వచ్చాయి. కాగా, 127 రేషన్ కార్డుల్ని రెన్యూవల్ చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు