దుబాయ్ : నిబంధనలు పాటించని 19 షాపుల సీజ్..118 షాపు యజమానులకు వార్నింగ్

- May 01, 2020 , by Maagulf
దుబాయ్ : నిబంధనలు పాటించని 19 షాపుల సీజ్..118 షాపు యజమానులకు వార్నింగ్

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన మార్గనిర్దేశకాలను పాటించని షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. నిబంధనల అమలు తీరుపై తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా దుబాయ్ ఆర్ధిక శాఖ విభాగం అధికారులు పలు షాపింగ్ మాల్స్, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. మాస్కులు, గ్లౌజ్, సామాజిక దూరం పాటించకపోవటం ఇలా పలు నిబంధనలు పాటించని 19 షాపులను సీజ్ చేశారు. మరో 118 షాపు ఓనర్లకు నోటీసుల ద్వారా మందలించారు. లాక్ డౌన్ నిబంధనలు సడలింపు సమయంలోనూ కరోనా వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు పాటించాలంటూ అధికారులు మార్గనిర్దేశకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రతి షాపు నిర్వాహకులు మాస్కులు, చేతికి గ్లౌజులు విధిగా ధరించాలి. అలాగే స్టోర్స్ లో కస్టమర్లను గుంపులుగా అనుమతించకుండా సామాజిక దూరాన్ని అమలు చేయాలి. ఈ నిబంధనలు ఎంతవరకు అమలు అవుతున్నాయో పరిశీలించేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. 432 షాపులలో మాత్రం మార్గనిర్దేశకాలను పాటిస్తున్నట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com